Saturday, December 4, 2010

Jai Telangana - Muslim La koreka

Telangana Amara Verulaku Jai

Jai Telangana Video

ఆంధ్ర అనచబాటుతానం

చరితాలు చదివిన
చరిత్రలలో వెతికినా
కలతల్లె మిగులుతుంది
కనులముందు ఈ నిజం
యుగ యుగాల , తర తరాల వెనుకబాటు తనం
ఆడుగడుగున అనచబాటుతానం
చరిత్ర నిర్మించిన పోరాటాలు జరిగాయ్ ఇక్కడ
ఐన అవి లికించ బడలేదు ఎక్కడ
మనస్సును కదిలించే వెధలున్నై ఇక్కడ
మట్టిలో పరిమళించే మహానుభావుల కథలున్నాయి ఇక్క్కడ
ఐన అవి ప్రచురించబడలేదు ఎక్కడ
కారణం ఆంధ్ర అంచబాటు తనం
చరిత్ర సృష్టించిన చరిత్రకారులకు
తెలుగు చరిత్ర పుటల్లో వెనుకబాటుతనం
తెలుగు చరిత్ర లో తెలంగాణ సంస్కృతి ది వెనుకబాటుతనం
సమైక్య రాష్ట్రము లో తెలంగాణ సంప్రదాయం ది అనచాబాటుతనం
తెలంగాణ సమరయోధులకు తెలుగు చరిత్ర లో
సుస్థిర స్థానం కల్పించుటలో వెనుకబాటుతనం
తెలంగాణ కవులకు తెలుగు సాహిత్యం లో
సముచిత గౌరవం కల్పించుటలో అనచబాటుతనం
తెలంగాణ మేధావులకు వీలువనివ్వడం లో వెనుకబాటుతనం
తెలంగాణ బాషను గుర్తించటంలో అనచబాటుతనం
తెలంగాణ యాసను గౌరవించటం లో వెనుకబాటుతనం
అభివృధిలో అనచబాటుతనం
అధికారంలో వెనుకబాటుతనం
ఆధునికరణం లో అనచబాటుతనం
అన్నింటిలో వెనుకబాటుతనం
ఒక్క ఆకలిలో తప్ప
అన్నింటిలో అనచబాటుతనం
ఒక్క అన్యాయాం లో తప్ప
నివేదికలిచ్చే న్యాయనిర్నేతల్లో సైతం పక్షపాతతనం
ఇదే మన తెలంగాణ దౌర్భాగ్యతనం
అన్నింటికీ కారణం ఆంధ్ర అంచబాటు తనం
జై తెలంగాణ జై జై తెలంగాణ

Telangana - బతుక(మ్మ)ట

రంగు రంగుల పువ్వులు పేర్చి
రంగ వల్లుల లోగిళ్ళకు చేర్చి
కొత్త బట్టలు కట్టి
కొలువుల గౌరమ్మను నెత్తి కెత్తి
ఆడపడుచులు పాడేపాట
ఆత్మ గౌరవపు తెలంగాణ ఆట
తెలంగాణ బ్రతుకు తెలుపు పాట
మా బ్రతుకమ్మ ఆట

తెల్లని గునుగు తో తెలంగాణ మనస్సు తెలుపుతూ
పసుపు తన్గేల్లతో మా పల్లె వెలుగులు నింపుతూ
కట్ల పూలతో కష్ట సుఖాలను కలుపుతూ
టేకు పూలతో తెలంగాణ తెగువ తెలుపుతూ
పట్టు కుచ్చు పూలతో పాశాలు పెంచుతూ
బంతి పూలతో మా బతుకులు బాగుండాలని కోరుతూ
గుమ్మడి పూలతో కొలువున్న గౌరీ దేవిని గుర్తు చేస్తూ
రంగు రంగుల పూలు రంగరించి
తెలంగాణ రూపు పేర్చి
ఏడు రంగుల పూలతో ఇంద్ర ధనస్సును తలదన్నే
తల్లి తెలంగాణ ఇలవేల్పును నిలిపి
ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ
మాలోని ఒక్కొక్క ఆశను
చిత్తు చిత్తులా బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ
అంటూ సంగామేశ్వరులకు సమర్పించుకుంటూ
రామ రామ ఉయ్యాలో అంటూ చిత్త
శుద్ధితో శ్రీ రామున్ని తలచి
పదిలంగా మమ్ము చూడమని
పార్వతి పరమేశ్వరులను కొలచి
ఆడి పాడే తెలంగాణ సంస్కృతి పాట
ఆత్మ గౌరవపు బతుకమ్మ ఆట
తొమ్మిది రోజులాటలో
తొలిరోజు ఎంగిలి పూలేసి
గ్రాహపాటు పొరపాటు
దరిచేర నివ్వవద్దని
నవ రాత్రులు నవ గ్రహాలను పూజించి
సద్దుల బతుకమ్మను
సాగనంపుతూ
ఇస్తినమ్మా వాయినం
పుచుకున్తినమ్మ వాయినం
అని వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటూ
తెలంగాణ ప్రేమను పెంచి పంచుకుంటూ
చల్లంగా బ్రతుకమ్మ అని దీవించే
బతుకమ్మ తల్లిని బద్రంగా కొలిచి
మల్లచ్చే దాక మమ్మల్ని చల్లంగా
చూడమని మదిలోనే తలచి పడే
సాంప్రదాయపు పాట
తెలంగాణ బ్రతుకమ్మ ఆట

జై బతుకమ్మ జై జై తెలంగాణ

Telangana Charithra

నాలుగు వేల ఏళ్ళ తెలుగు చరిత్ర మాది అంటూ
నరం లేని నాలుక తెగేల అరుస్తున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ గత చరిత్ర లో
గతాన్ని తవ్విన కొద్ది నిజం గొంతు నలిపి మీరు పాతర వేసిన గోతులే
చరిత్ర నిర్మాణాన్ని చుసిన కొద్ది
సత్యాన్ని సమాధి చేసి మీరు కట్టిన గోరీలు తప్ప
ఏముంది మీ చరిత్ర లో ……..
చరిత్ర అంటే మాది మా తెలంగాణది
మా చరిత్రలో
వీర నారి రుద్రమ ఉంది
కాకతీయుల కళాత్మకత ఉంది
సింహాల మీద సవారి చేసిన శాతవాహనుల శూరత్వం ఉంది
వేంగి చాళుక్యుల వీరత్వం ఉంది ఈ మట్టిలో
వేములవాడ మహత్యం ఉంది
సమైక్య ఆంధ్ర ఉద్యమం అంటూ
సంకలు గుద్దుకుంటున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ ఉద్యమం లో
సమైక్య ఆంధ్ర అంటూ మీతో వచ్చినోల్లు ఎంత మంది
సమైక్య ఆంధ్ర కోసం మీలో సచ్చినోళ్ళు ఎంత మంది

అధికారంతో నిండిన అహంకారం
పచ్చ నోట్లతో పుట్టుకొచ్చిన పిచ్చిఉద్యమం తప్ప
యుద్ధం అంటే మా తెలంగాణ ది
నీజాం నిరంకుశత్వం నడ్డి విరిచిన మాది యుద్ధం అంటే
మా యుద్ధం లో …….
ఒక్క దొడ్డి కొమురయ్య
ఒక్క గొట్టిముక్కుల గోపాల్ రెడ్డి
ఒక్క రేణిగుంట రాంరెడ్డి
మరెందరో అమరులు ఉన్నారు
పోరాటం పోరాటం అంటూ పోర్లు దండాలు పెడుతున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ పోరాటం లో
లగడపాటి లంగేశాలు
నన్నపనేని నోదుటి ముద్దులు తప్ప

పోరాటం అంటే మాది
మా చరిత్రలో
సాయుధ రైతాంగ పోరాటాముంది
మంటల్లో కాలుతున్న మారుమ్రోగిన తెలంగాణ నినాదం ఉంది
లాటీలు,తూటాలు తగిలిన తగ్గని వేడి ఉంది
త్యాగాలు మావి అని తెగ చించుకుంటున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ త్యాగాల చరిత్ర లో
ఒక్క పొట్టి శ్రీరాములు తప్ప
త్యాగాలు అంటే మావి
తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన నాటి నాలుగు వేల మందివి
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన నేటి నాలుగు వందల మందివి
మా త్యగాలలో ………
బైరాన్ పల్లి చవులు ఉన్నాయి
భవిష్యత్తును చేజార్చుకున్న జీవితాలున్నాయి
నేల రాలిన విద్య కుసుమాలు ఉన్నాయి
బలుపు ఆరాటాలు మీవి
బలిధాన పోరాటాలు మావి
మీ కోసం మందిని బలి తీసుకునేది మీరు
మంది కోసం బలిదానాలు చేసుకొనేది మేము
మా బలిధనాలలో
ఒక్క శ్రికంతచారి
ఒక్క యాదయ్య
ఒక్క సుజాత
ఒక్క ప్రశాంత్ రెడ్డి
ఎంతో మంది అమరులున్నారు
మానవత్వం లేని నాయకులారా ఇకనైనా మారండి
లేకుంటే
బలిదానాలు చేసుకోవడమే కాదు
బలి తీసుకోవడం కూడా మాకు తెలుసు
మా నెత్తురు లో వేడి ఉంది
మా చేతల్లో వాడి ఉంది
మా కన్నిటిలో నిజం ఉంది
మా పోరాటం లో అర్ధం ఉంది
మీ చరిత్ర లో ఏముంది చదలు పట్టిన గతం తప్ప
ఎంత వెతికినా దొరకనిది మీ చరిత్ర
ఎంత రాసిన ఒడువంది మా చరిత్ర
జై తెలంగాణ జై జై తెలంగాణ

Jai Telangana Video

Telangana Thali

Jai Telangana Video