Saturday, December 4, 2010

Telangana - బతుక(మ్మ)ట

రంగు రంగుల పువ్వులు పేర్చి
రంగ వల్లుల లోగిళ్ళకు చేర్చి
కొత్త బట్టలు కట్టి
కొలువుల గౌరమ్మను నెత్తి కెత్తి
ఆడపడుచులు పాడేపాట
ఆత్మ గౌరవపు తెలంగాణ ఆట
తెలంగాణ బ్రతుకు తెలుపు పాట
మా బ్రతుకమ్మ ఆట

తెల్లని గునుగు తో తెలంగాణ మనస్సు తెలుపుతూ
పసుపు తన్గేల్లతో మా పల్లె వెలుగులు నింపుతూ
కట్ల పూలతో కష్ట సుఖాలను కలుపుతూ
టేకు పూలతో తెలంగాణ తెగువ తెలుపుతూ
పట్టు కుచ్చు పూలతో పాశాలు పెంచుతూ
బంతి పూలతో మా బతుకులు బాగుండాలని కోరుతూ
గుమ్మడి పూలతో కొలువున్న గౌరీ దేవిని గుర్తు చేస్తూ
రంగు రంగుల పూలు రంగరించి
తెలంగాణ రూపు పేర్చి
ఏడు రంగుల పూలతో ఇంద్ర ధనస్సును తలదన్నే
తల్లి తెలంగాణ ఇలవేల్పును నిలిపి
ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ
మాలోని ఒక్కొక్క ఆశను
చిత్తు చిత్తులా బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ
అంటూ సంగామేశ్వరులకు సమర్పించుకుంటూ
రామ రామ ఉయ్యాలో అంటూ చిత్త
శుద్ధితో శ్రీ రామున్ని తలచి
పదిలంగా మమ్ము చూడమని
పార్వతి పరమేశ్వరులను కొలచి
ఆడి పాడే తెలంగాణ సంస్కృతి పాట
ఆత్మ గౌరవపు బతుకమ్మ ఆట
తొమ్మిది రోజులాటలో
తొలిరోజు ఎంగిలి పూలేసి
గ్రాహపాటు పొరపాటు
దరిచేర నివ్వవద్దని
నవ రాత్రులు నవ గ్రహాలను పూజించి
సద్దుల బతుకమ్మను
సాగనంపుతూ
ఇస్తినమ్మా వాయినం
పుచుకున్తినమ్మ వాయినం
అని వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటూ
తెలంగాణ ప్రేమను పెంచి పంచుకుంటూ
చల్లంగా బ్రతుకమ్మ అని దీవించే
బతుకమ్మ తల్లిని బద్రంగా కొలిచి
మల్లచ్చే దాక మమ్మల్ని చల్లంగా
చూడమని మదిలోనే తలచి పడే
సాంప్రదాయపు పాట
తెలంగాణ బ్రతుకమ్మ ఆట

జై బతుకమ్మ జై జై తెలంగాణ

No comments:

Post a Comment